గార్బేజ్ పాయింట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
• ప్రతి ఒక్కరూ ఉత్తమ పనితీరును కనబరచాలి
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
నగరంలో పారిశుద్ధ్య పనులను పక్కాగా, పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఏ.క్యాంపు, జొహరపురం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం సెట్కూరు కార్యాలయం వద్దనున్న అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి నిర్వహణ, పరిశుభ్రతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని గార్బేజ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా సకాలంలో తరలింపు చేపట్టాలని సూచించారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతి రోజూ నిర్దేశిత పనులను పూర్తిచేయాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ పనితీరును కనబరుస్తూ నగర పరిశుభ్రతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య సేవలను నిరంతరం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
For suggestions / doubts / complaints