కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు 2025-2026 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30 వ తేది వరకు సర్వీస్ లో ఉన్న అర్హులైన కుర్నూలు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన ఒప్పంద అధ్యాపకులు 2026-2027 విద్యా సంవత్సరానికి వారి రెన్యువల్ కొరకు 18 జూలై 2026 తేదీలోపు వారు పనిచేస్తున్న సంబంధిత కళాశాలలోని ప్రిన్సిపాల్ లకు దరఖాస్తులు చేసుకోవలసిందిగా కర్నూలు జిల్లా ఐడీ కళాశాల అయిన కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం భారతి ఒక ప్రకటనలో తెలిపారు, ధరకాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు, ssc ధృవీకరణ పత్రము జత చేయవలసిందిగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.
డాక్టర్ యం భారతి
ప్రిన్సిపాల్
కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల,
క్లస్టర్ విశ్వవిద్యాలయం
కర్నూలు
Comments
Post a Comment
For suggestions / doubts / complaints