ప్రియమైన నా దేశ ప్రజలారా,
పవిత్ర, శుభపద్రమైన ఉగాది పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వసంత రుతువు మన చుట్టూ ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచే అందమైన కాలమిది. కొత్తగా వికసించే పూల పరిమళం, ఈ కాలంలో లభించే పండ్ల ఆగమనం కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతంగా నిలుస్తాయి. కష్టజీవులైన మన రైతన్నలు గొప్ప ఆశావాదంతో తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇదే.
జీవితంలోని అన్ని రుచులనూ స్వీకరించాలని గుర్తుచేసే సంప్రదాయ ఉత్సవం ఉగాది. అనేక సంస్కృతుల్లో వివిధ వంటకాలతో పాటు తీపి, చేదు రుచులు కలగలిసిన వంటకాలను తయారుచేసే సంప్రదాయం ఈ పండుగ రోజు ఉంది. ఇది జీవితానికి ఉండే లోతైన అర్థాన్ని తెలియజేయడంతో పాటు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా, విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది.
ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు తలపెట్టే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించి, శాంతి, సానుకూలతను పంచాలని ఆశిస్తున్నాను.
మీ
నరేంద్ర మోదీ
Comments
Post a Comment
For suggestions / doubts / complaints