కర్నూలు, 11 మార్చి 2026: స్థానిక కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమిస్ట్రీ" అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డీబీటీ స్టార్ కాలేజ్ స్కీమ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ డి.బి. రామాచారి గారు ముఖ్య అతిథిగా మరియు వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన "ఆర్గానోక్యాటలిసిస్" అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్గానోకాటలిసిస్ మరియు ఆధునిక సేంద్రీయ రసాయన శాస్త్రంలో దాని ప్రాధాన్యం గురించి ప్రొఫెసర్ వివరించారు. రసాయన శాస్త్రంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను ఆయన అధ్యాపకులకు కళ్లకు కట్టినట్లు వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకట రెడ్డి గారు మాట్లాడుతూ రసాయన శాస్త్రంలో వస్తున్న సమూల మార్పులపై అధ్యాపకులకు అవగాహన కల్పించడమే ఈ ఐదు రోజుల శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఎఫ్‌డిపి కన్వీనర్ డాక్టర్ జె. కల్పన గారు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగపు అధ్యాపకులు, వివిధ కళాశాలల నుండి వచ్చిన ప్రతినిధులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు