రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్

 


ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖమైన ప్రాజెక్టుల్లో ఒకటి #రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు  వివాదాస్పదమైనది ? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో #వైరల్ అవుతున్నందుకు కారణం ? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ... తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను  నేను బంద్ చేయించాను అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అన్నారు. 


తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయం మొదలైన తర్వాత, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధుల పార్టీలు, రాయలసీమ ఫోరం అధినేతలు కూడా మాట్లాడారు, మూడు టీఎంసీల నీరు మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ ప్రజలకు చేకూరుతున్నాయి.  


ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు వరద సమయంలో  దాదాపు 700 నుంచి 800 టీఎంసీలు వరద ప్రవాహ సమయంలో ఆ నీటిని ఒడిసిపెట్టి రాయలసీమకు నీటిని అందించడమే ప్రధాన ఉద్దేశం.


 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రస్తుతం శ్రీశైలం నీటి ప్రాజెక్టులో 315 టీఎంసీ లు  నీటి నిలువ సామర్థ్యం, కానీ ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువ కావడం వలన శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి మట్టం పూడిక నిండిపోవడం వలన ప్రస్తుతం నీటిమట్టం 200 టీఎంసీలకు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి సామర్ధ్యo ఉన్నది. 


ఈ నీటి సామర్థ్యం ఉండడం వలన రాయలసీమకు కావాల్సినటువంటి  త్రాగు సాగునీరుకి కాకుండా -  విద్యుత్ అవసరాలకు మాత్రమే ప్రముఖంగా కరెంట్ ఉత్పత్తికి, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని వాడడం వలన నీతి కొరత ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది.


  దీనిలో భాగంగా తెలంగాణ లో దిండి, రంగారెడ్డి, పాలమూరు  ప్రాజెక్టుల ద్వారా ఉన్న నీటిని వేగంగా తోడవడం వలన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది.


 ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు సరిహద్దు చేకూర్చుకొని ఈ ప్రాజెక్టు యొక్క నైపుణ్యం గురించి చర్చించి రాయలసీమ ప్రజలకు మంచి చేకూరాలని, రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు, రాయలసీమ మేధావి వర్గం మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రముఖులు చర్చించాలని కోరుతున్నారు.


#తాజాసమాచారం 

#నీరు 

#లిఫ్ట్ ఇరిగేషన్ 

#శ్రీశైలం #దిండి #ప్రాజెక్ట్ #ముచ్చుమర్రి #హంద్రీనివా #మల్యాల #తెలుగుగంగా

Comments