Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు

బాలికల రక్షణ, విద్య, సాధికారతతో పాటు బాలికల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి తమ నిబద్ధతను వ్య

 ప్రతి కుమార్తెకు సాధికారత కల్పిద్దాం, బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం:

 బాలికల హక్కులు, విజయాలు మరియు సవాళ్లను గుర్తించడానికి అంకితమైన రోజుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని ఈ రోజు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, బాలికల విద్యకు మద్దతు ఇవ్వడానికి మరియు వారిని ప్రభావితం చేసే వివిధ సామాజిక సమస్యలను పరిష్కరించడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా బాలికల రక్షణ, విద్య, సాధికారతతో పాటు బాలికల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఉపాధ్యక్షులు డా. బి ప్రసాద్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు, మహిళా సాధికారత శాఖ కన్వీనర్ డా. హెచ్. అక్తర్ బాను సభను నిర్వహించారు. 

Photograph


ఈ కార్యక్రమంలో డా. అనుష, డా. విమల రోహే, డా. ఫమీదా, డా. స్వప్న, డా. షనావాజ్, డా. సవిత, డా కె నాగరాజ శెట్టి, డా. రాజశేఖర్, డా. సతీంద్ర, డా. యెల్లా కృష్ణ, డా మీర్ అల్తాఫ్, డా బాలరాజు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యా సంస్థలు బాలికలకు సురక్షితమైన, సమాన అవకాశాలున్న, సాధికారతతో కూడిన వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది

Post a Comment

For suggestions / doubts / complaints