Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఘనంగా NSS దినోత్సవం

ముఖ్యఅతిథిగా గౌరవనీయులు DSP మహబూబ్ బాషా గారు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.ఇందిరా శాంతి గారు తెలిపారు.

 

NSS DAY IN KURNOOL KVR COLLEGE

     స్థానిక కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈరోజు NSS దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు DSP మహబూబ్ బాషా గారు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.ఇందిరా శాంతి గారు తెలిపారు ముఖ్య అతిథి మహబూబ్ భాషా గారు NSS వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ సేవ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యార్థినిలుగా మనకు తోచిన సాయాన్ని సమాజానికి చేయాలని అన్నారు. ముఖ్యంగా చెట్లను నాటడం అనేక సామాజిక సమస్యలపై చేస్తున్న అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రతి విద్యార్థిని గొప్పస్థాయికి ఎదగాలని, దానికి కావాల్సిన సూచనలని అధ్యాపకుల ద్వారా తెలుసుకొని పై స్థాయి ఉద్యోగాల్ని సాధించాలి అని సూచించారు. ప్రిన్సిపాల్ యం ఇందిరా శాంతి మేడం మాట్లాడుతూ NSS వాలంటీర్లుగా సమాజానికి సేవ చేస్తూ కళాశాలకు మంచి పేరు తేవాలని వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

     ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఆటపాటలతో అలరించారు విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ఆవరణంలో మొక్కలు కూడా నాటారు, NSS సమన్వయకర్తలు యూనిట్ (వన్) జయలక్ష్మి గారు యూనిట్ (టూ) డాక్టర్ బాశెట్టి లత గారు అధ్యాపకులు మౌనిక, మణికంఠ గార్లు ఇతర అధ్యాపకులు NSS వాలంటీర్లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

Post a Comment

For suggestions / doubts / complaints